News

170 ఏళ్ల కలను నిజం చేశారు


నీటీపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు ఈ ఏడాది రాయలసీమకు 24 టీఎంసీల నీరు ఇచ్చామని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతలకు రూ.4,909 కోట్ల పాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. చింతలపూడి ద్వారా కృష్ణా, ప.గో జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని అన్నారు. జగన్‌ రాజశేఖర్‌రెడ్డి వారసుడు కాదని, రాజారెడ్డి వారసుడని అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలపాలన్న 170 ఏళ్ల కలను చంద్రబాబు నిజం చేశారని పేర్కొన్నారు.